ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

1 దినవృత్తాంతాలు

1 దినవృత్తాంతాలు

పరిచయం

పేరు:

హీబ్రూ బైబిలులో 1,2 దినవృత్తాంతాలు ఒకే పుస్తకంలా కలిసివుండేవి. అయితే యూదులు పండితులు పాత ఒడంబడికను గ్రీకు భాషలోకి అనువదించేటప్పుడు దానిని రెండుగా విడదీశారు.

రచయిత:

యూదుల సాంప్రదాయం ప్రకారం ఎజ్రా 1,2 దినవృత్తాంతాలను వ్రాశాడు (ఎజ్రా, నెహెమ్యా పుస్తకాలను కూడా).

వ్రాసిన కాలం:
బహుశా క్రీ.పూ. 450-430 మధ్యకాలంలో వ్రాసి ఉండాలి.

ముఖ్యాంశాలు:

ఇస్రాయేల్‌వారు ఏ వంశం నుండి వచ్చారో తెలియజేసే వంశావళులు అబ్రాహాము, నోవహు, ఆదాము వరకు చేరుతున్నాయి.
 ఈ పుస్తకం వివరించే సంఘటనలు చాలమట్టుకు
 దావీదు జీవితానికి సంబంధించినవే. ఈ రీతిగా చూస్తే దీనిని 2 సమూయేలు పుస్తకంతో సరిపోల్చవచ్చు. ఈ పుస్తకం దావీదు గొప్పతనాన్ని ఎత్తి చెప్తున్నదే గాని అతడు చేసిన పాపం, పొందిన శిక్షను గురించి చెప్పేది చాలా తక్కువ. బెత్‌షెబతో అతడు చేసిన పాపం, అలాగే అతనిపై అబ్‌షాలోం చేసిన తిరుగుబాటును గురించిన మాట ఏమీ లేదు.

 యెహోవా దేవునితో తమకు సరియైన సంబంధం ఉన్నప్పుడే యూదులు తమ దేశ ఉన్నతినీ మహిమనూ అనుభవించగలరని ఈ పుస్తకం నేర్పుతుంది. విజయాన్ని, దీవెనలను పొందడానికి యెహోవాకు లోబడడమే మూలసూత్రం.

విషయసూచిక: -

ఆదాము దగ్గర నుండి దావీదు వరకు వంశావళులు 1:1—9:44

ఆదాము నుండి ఇస్రాయేల్ కుమారులవరకు 1:1-54

యాకోబు 12 మంది కుమారులు 2:1-2

యూదా సంతతులు 2:3—4:21

యబ్బేజు ప్రార్థన 4:9-10

షిమ్యోను సంతతివారు 4:24-43

రూబేను, గాదు, మనష్షే సంతతులు 5:1-26

లేవీ సంతతులు 6:1-80

ఇశ్శాకారు, బెన్యామీను, నఫ్తాలి, మనష్షే,
ఎఫ్రాయిం, ఆషేరు సంతతులు 7:1-40

బెన్యామీను నుండి సౌలు అతని కుమారుల సంతతులు వరకు 8:1-40

బబులోను చెర తరువాత జెరుసలంలో స్థిరపడిన యూదులు 9:1-34

సౌలు వంశావళి 9:35-44

సౌలు మరణం 10:1-14

దావీదు రాజయ్యాడు 11:1-3

దావీదు జెరుసలంను జయించాడు 11:4-9

దావీదు శూరులు 11:10-47

దావీదు మనుష్యులు అతన్ని ఎడారిలో కలుసుకొన్నారు 12:1-22

హెబ్రోనులో దావీదును కలుసుకొన్నవారు 12:23-40

మందసాన్ని తిరిగి తీసుకురావడానికి దావీదు ప్రయత్నం,
ఉజ్జా మరణం 13:1-14

జెరుసలంలో దావీదు 14:1-7

దావీదు ఫిలిష్తీయులను ఓడించాడు 14:8-17

దావీదు మందసాన్ని జెరుసలంకు తిరిగి తీసుకురావడం 15:1—16:6

దావీదు స్తుతిగీతం 16:7-36

దావీదుతో దేవుని ఒడంబడిక 17:1-15

దావీదు ప్రార్థన 17:16-27

దావీదు విజయాలు 18—20 అధ్యాయాలు

దావీదు సైతాను ప్రేరేపణకు లొంగిపోయాడు 21:1-7

దావీదు పాపానికి వచ్చిన ఫలితాలు 21:8-17

దేవుని దూత ఖడ్గాన్ని ఆపుజేయడం 21:18-30

దేవాలయం కట్టడానికి సిద్ధపాట్లు 22:2-19

లేవీగోత్రికుల కుటుంబాల పనులు 23:1-32

యాజులలో విభజన 24:1-19

దేవాలయ ఆరాధనకు గాయకులు 25:1-31

దేవాలయ ద్వారపాలకులు 26:1-19

వివిధ అధికారులు 26:20-32

సైన్యం, అధికారులు 27:1-15

ఇతర అధికారులు 27:16-34

దేవాలయం కట్టడానికి దావీదు ఏర్పాట్లు 28:1-21

దేవాలయానికి కానుకలు 29:1-9

దావీదు ప్రార్థన 29:10-19

సొలొమోను రాజుగా స్థిరపడడం 29:21-25

దావీదు మరణం 29:26-30

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...