ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెహోషువ. పరిచయం

యెహోషువ

పరిచయం

రచయిత:

యూదుల సాంప్రదాయాల ప్రకారం 24:29-33 మినహాయిస్తే ఈ పుస్తకానికి రచయిత యెహోషువే. యెహోషువ ఈ పుస్తకాన్ని రచించాడనడానికి పుస్తకంలోనే సాక్ష్యాధారాలున్నాయి. చూడండి 24:26. 5:1 కూడా చూడండి “మేము దాటే వరకు ఇస్రాయేల్ ప్రజల ముందు ఎండిపోయేలా” అనే వచనంలో “మేము” అనే పదాన్ని గమనించండి. యెహోషువ మోషేతో ఈజిప్ట్‌నుండి బయటకు వచ్చి ఎడారిప్రాంతాలలో మోషేతోను ఇస్రాయేల్‌తోను 40 సంవత్సరాలు గడిపాడు. 

అతడు యుద్ధంలో ఆరితేరిన నాయకుడు (నిర్గమ 17:8-13).
 అంతేకాదు అతడు విశ్వాసపరుడు, నమ్మకస్థుడు (సంఖ్యా 14:6-9). 
యెహోషువ అనే పేరుకు అర్థం – “యెహోవా రక్షణను ఇస్తాడు” లేక “యెహోవా జయాన్ని కలుగజేస్తాడు”.

వ్రాసిన కాలం:

కనానును వశపరచుకోవడం అనేది బహుశా సుమారు క్రీ.పూ. 1406లో జరిగి ఉండాలి. దేశాన్ని చాలమట్టుకు వశపరచుకోవడం జరిగిన తరువాత అతని జీవిత అంత్యదశలో యెహోషువ ఈ పుస్తకాన్ని వ్రాసి ఉండాలి.

ముఖ్యాంశాలు:

దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని దేవుని ప్రజలు స్వాధీనం చేసుకోవడం, దేవుడు వారికి అందించిన విజయం, కనాను కోసం పోరాడడంలో వారు నేర్చుకొనిన పాఠాలు. ఇప్పటి విశ్వాసుల కోసం ఈ పుస్తకంలో ఆత్మ సంబంధమైన పాఠాలు ఎన్నో ఉన్నాయి. పుస్తకంలో ప్రత్యక్షంగా జరిగిన సంఘటనలు పరోక్షంగా ఆత్మసంబంధమైన మన జీవితానికి, పోరాటానికి ఆదర్శచిత్రాలుగా ఉన్నాయి. 

చూడండి యెహో 1:17కు వ్రాసిన నోట్స్.
 { 1:17 యెహోషువ దైవసన్నిధిలో, ఆశీర్వాదంలో నిలిచి ఉండాలని ప్రజలకు గట్టిగా చెప్పడం మంచిదే. ఎందుకంటే దేవునితో సహవాసం పోగొట్టుకున్న నాయకుణ్ణి అనుసరించడం ప్రమాదంతో కూడుకొన్న పని.}

ఈ పుస్తకంలోని మరో ముఖ్యాంశం – దుష్ట ప్రజల నాశనం. చూడండి 6:21; 8:26; 10:28, 35, 37, 39, 40 మొదలైనవి. 
- ఇది దైవాజ్ఞననుసరించే జరిగింది. చూడండి ద్వితీ 7:1-2, 16. అంతేగాక జరిగినది దేవుని నాయకత్వం క్రిందనే జరిగింది – యెహో 5:13-15. అయితే ప్రజలందరిని నశింపజేయడం దేవునికి న్యాయమా, సరియా? అవును ముమ్మాటికి అది న్యాయం, సరియే. అందుకే దేవుడలా చేశాడు. 

- దేవుడేది చేసినా అది న్యాయం, సరియై ఉంటుంది. దుష్టులను నాశనం చేయడం గురించి మరెక్కువ తెలుసుకోవడానికి ఇక్కడ ఇచ్చిన వాక్యభాగాల పీఠికలను చూడండి – ఆది 6:7; 15:16; లేవీ 18:24-25; ద్వితీ 13:12-18; కీర్తన 47:2; 2 తెస్స 1:5-9; ప్రకటన 16:5-7. కనానుదేశంలో ఉండినవారు విగ్రహారాధనను, పసిపిల్లల బలిని, లైంగిక దుష్కార్యాలను వారి దేవుని పేరట ఆచరించేవారు. వారు చాల క్రూరులు, చెడినవారు. అలాంటివారితో కలవడం అంటే ఇస్రాయేల్‌వారికి అది ముప్పే అవుతుంది. ఎందుకంటే వారిని నిజ దేవుడు తనను ఆరాధించడానికి, తన గురించి ప్రకటించడానికి ప్రత్యేకించుకున్నాడు. కనానువారి పాపాలు నిండాయి. అందుకే వారిని నాశనం చేయడానికి సమయం వచ్చిందని దేవుడు నిర్ణయించాడు. 

- యెహోషువలోని కొన్ని ముఖ్యవాక్యాలు: 1:3-9; 5:13-15; 21:43-45; 24:14-15.

విషయసూచిక : -

యెహోషువను దేవుడు పనిమీద నియమించడం 1:1-9

యొర్దాను నదిని దాటడానికి సిద్ధపాటు 1:10-18

రాహాబు, గూఢచారులు 2:1-21

యొర్దానును దాటడం 3:1-17

గిల్గాలు దగ్గర ఒక స్మారక చిహ్నం 4:1-24

గిల్గాలు దగ్గర సున్నతి 5:1-9

వాగ్దాన దేశంలో పస్కా ఆచరణ, మన్నా ఆగిపోవడం 5:10-12

దేవుని సేనాధిపతి 5:13-15

యెరికో పతనం 6:1-27

రాహాబు తప్పించుకోవడం 6:22-23

యెరికోపై శాపం 6:26-27

ఆకాను దురాశ, అవిధేయత 7:1-26

హాయీ నాశనం 8:1-29

ఒడంబడికను తిరిగి స్థిరపరచడం 8:30-34

కుయుక్తిపరులైన గిబియోనువారు 9:1-27

గిబియోను యుద్ధం, సూర్యగోళం నిలిచిపోవడం 10:1-43

కనానులోని ఉత్తరభాగం వశం చేసుకోవడం 11:1-15

యెహోషువ చేసిన పోరాటాల క్లుప్త వివరణ 11:16—12:24.

భూభాగాన్ని పంచుకోవడం 13—21 అధ్యాయాలు

భూవిభజన గురించి యెహోషువ నిర్ణయించిన విధులు 13:1-7

యొర్దానుకు పూర్వదిక్కునున్న భూభాగం రూబేను,
గాదు మనష్షేలో సగం గోత్రానికి 13:8-33

కాలేబుకు హెబ్రోను 14:6-15

యూదాకు, యోసేపు కుమారులకు భూభాగం 15—17 అధ్యాయాలు

షిలోహులో సమావేశం, మిగతా గోత్రాలకు భూభాగాలు 18:1—19:48

యెహోషువకు భూభాగం 19:49-51

శరణాగతులకు 6 పట్టణాలు 20:1-9

లేవీవారికి పట్టణాలు 21:1-45

పూర్వదిక్కున ఉన్న గోత్రాలు తిరిగిరావడం సాక్ష్యవేదిక 22 అధ్యాయం

యెహోషువ ఇచ్చిన చివరి ఉపదేశం 23 అధ్యాయం

షెకెములో ఒడంబడికను తిరిగి స్థాపించుకోవడం 24:1-28

యెహోషువ మరణం 24:29-33

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...