ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ద్వితీయోపదేశకాండం (ధర్మోపదేశం)పరిచయం

ద్వితీయోపదేశకాండం (ధర్మోపదేశం)

పరిచయం

పేరు:

యూదులు ఈ పుస్తకాన్ని మొదటి వచనాన్నిబట్టి “మాటలు ఇవి” లేదా కేవలం “మాటలు” అని పిలిచేవారు. ఆదికాండం పరిచయం చూడండి.

రచయిత, వ్రాసిన కాలం:
ఆదికాండం పరిచయం చూడండి.

ముఖ్యాంశం:

ఇది జ్ఞాపకాల పుస్తకం (1:3; 4:9-10, 23, 31; 5:15; 6:12; 7:18; 8:2, 11, 14, 18, 19; 9:7; 11:2; 15:15; 16:3; 24:9; 25:19). పర్వతం మీద దేవుడిచ్చిన ధర్మశాస్త్రం గురించి మళ్ళీ చెప్పడం, ఇస్రాయేల్‌తో దేవుని ఒడంబడికను మళ్ళీ స్థిరపరచడం, ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలూ బాధ్యతలూ తేటగా, పూర్తిగా రాసి ఉన్నాయి. 

ప్రత్యేకంగా దేవుడు తనకూ ఇస్రాయేల్‌కూ మధ్య ఉన్న ప్రేమ బంధం గురించి నొక్కి చెప్తున్నాడు (4:37; 6:5; 7:8, 13; 10:12, 15; 19:9; 30:6, 16, 19, 20; 33:3). 

విగ్రహపూజ విషయంలో ఇస్రాయేల్‌కు ఉన్న బలహీనతను తెలిసిన దేవుడు వారిని చాలా బలమైన మాటలతో హెచ్చరిస్తూ విగ్రహాలనుంచీ ఇతర దేవుళ్ళనుంచీ దూరంగా ఉండాలని చెప్తున్నాడు (6:14-15; 7:4; 8:19-20; 11:16; 13:1-18; 17:2-7; 27:15; 29:17-18; 30:17-18)

విషయసూచిక

సీనాయి పర్వతం నుంచి కనాను సరిహద్దుల వరకు ఇస్రాయేల్‌వారు సాగించిన
ప్రయాణాల సంక్షిప్త చరిత్ర 1:6—3:29

దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని ఇస్రాయేల్‌కు మోషే ఇచ్చిన ప్రోత్సాహం 4:1-24

కనానులో ఏమి జరగవచ్చునో దాని గురించిన హెచ్చరికలు 4:25-31

యెహోవా ఒక్కడే నిజమైన దేవుడు 4:32-40

యొర్దాను తూర్పున ఉన్న శరణు పట్టణాలు 4:41-43

పది ఆజ్ఞలు 5:1-33

ఆజ్ఞలన్నింటిలోకీ గొప్పది 6:5

దేవుని ఆజ్ఞలను పాటించడం విషయంలో ప్రోత్సహించడం 6:6-25

కనానునుంచి ఇతర జనాలను పారదోలడం 7:1-6

దేవుడు ఇస్రాయేల్‌జనాన్ని ఎందుకు ఎన్నుకొన్నాడు 7:7-11

విధేయతవల్ల వచ్చే దీవెనలు 7:12-15

కనానుప్రజలను తరిమివేయగల శక్తి దేవుడు వారికిస్తాననడం 7:16-26

దేవుణ్ణి, ఆయన ఆజ్ఞలను జ్ఞాపకం ఉంచుకోమని ప్రోత్సహించడం 8:1-20

దేవుడు కనానును ఇస్రాయేల్‌కు ఎందుకు ఇస్తున్నాడు 9:1-6

బంగారు దూడ 9:7-29

ఇస్రాయేల్ విధి 10:12—11:32

బలులు అర్పించడం కోసం ఒకే ఒక స్థలం 12:1-32

విగ్రహపూజకు శిక్ష 13:1-18

శుద్ధమైనవి, అశుద్ధమైనవి 14:1-21

పదో వంతులు 14:22-29

అప్పులు రద్దుచేయడం 15:1-11

పనివారిని, బానిసలను స్వతంత్రులుగా చేయడం 15:12-18

ఏటేటా జరిగే సాంవత్సరిక పండుగలు 16:1-17

న్యాయాధిపతుల నియామకం 16:18-20

సూర్యచంద్ర నక్షత్రాదులను లేక ఇతర దేవుళ్ళను పూజించినందువల్ల వచ్చే శిక్ష 17:2-7

న్యాయాలయాలు 17:8-13

రాజును ఎన్నుకోవడం 17:14-20

దేవుని సేవకులకు కానుకలు 18:1-8

దేవునికి అసహ్యమైన పనులు 18:9-13

రాబోయే గొప్ప ప్రవక్త 18:14-22

శరణు పట్టణాలు 19:1-14

ధర్మశాస్త్ర సారం 19:21

యుద్ధాన్ని గురించి 20:1-20

అంతుతెలియని హత్య 21:1-9

బందీలయిన స్త్రీలు 21:10-14

జ్యేష్ఠుడి హక్కులు 21:15-17

తిరుగుబాటు చేసిన కొడుకుకు శిక్ష 21:18-21

వివిధ నియమాలూ, చట్టాలూ 21:22—22:12

స్త్రీ పురుషుల మధ్య ఉన్న సరైన సంబంధాన్ని ఉల్లంఘించడం 22:13-30

పౌరత్వం హక్కు 23:1-8

వివిధ రకాలయిన నియమాలూ చట్టాలూ 23:9—25:19

విడాకులివ్వడం 24:1-4

పేదలపై కనికరం 24:12-22

విధవరాండ్రకు మళ్ళీ పెళ్ళిచేసే విషయం 25:5-10

మొదటి పంటలు, పదోవంతులు 26:1-15

పాపుల పై వచ్చే శాపాలు 27:14-26

విధేయతకు వచ్చే దీవెనలు 28:1-14

అవిధేయతకు వచ్చే శాపాలు 28:15-19

రాబోయే తీర్పును గురించి భయంకరమైన హెచ్చరికలు 28:20-68

ఒడంబడిక స్థిరపరచడం 29:1-18

దేవుని ఒడంబడికను అనుసరించనివారికి శిక్ష 29:19-29

శిక్ష తరువాత కలిగే మంచివాటిని గురించిన వాగ్దానాలు 30:1-10

ఇస్రాయేల్‌కు క్రొత్త నాయకుడైన యెహోషువ 31:1-8

జీవాన్ని లేక మరణాన్ని కోరడం 30:11-20

దేవుని ధర్మశాస్త్రం చదవడం 31:9-13

మోషే పాట 32:1-43

దేవుని ధర్మశాస్త్రాన్ని ఆచరించవలసిన ప్రాముఖ్యత 32:44-47

దేవుడు మోషేకు అతని మరణం గురించి చెప్పడం 32:48-52

గోత్రాల గురించి మోషే పలికిన దీవెనలు 33:1-29

మోషే మరణం, అతని గురించిన పదాలు 34:1-12

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...