ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

న్యాయాధిపతులు. పరిచయం

న్యాయాధిపతులు

పరిచయం

పేరు:

“న్యాయాధిపతులు” అని అనువదించిన హీబ్రూ పదానికి “నాయకులు” అనే అర్థం కూడా ఉంది. ఈ పుస్తకానికి “నాయకులు” అని పేరు పెట్టడమే ఎక్కువ సమంజసంగా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు ఎన్నుకొన్న నాయకులు ప్రజలకు తీర్పు చెప్పడంకంటే మించినదానినే చేశారు. బైబిలు పుస్తకాల పేర్ల గురించి ఆదికాండం పరిచయం చూడండి.

రచయిత:

యూదుల సాంప్రదాయం ప్రకారం సమూయేలు ఈ పుస్తకాన్ని వ్రాశాడు. అయినా అలా చెప్పడానికి ఖచ్చితమైన రుజువు లేదు.

వ్రాసినకాలం:
సుమారు క్రీ.పూ. 1000లో.

ముఖ్యాంశం:

ఈ పుస్తకంలో యెహోషువ మరణం మొదలుకొని సమూయేలు జన్మం వరకు ఇస్రాయేల్ చరిత్రలోని కొన్ని సంఘటనల వివరణ ఉంది. ఏ ప్రజలైనా గాని దేవునికిష్టమైనదానిని చేయడానికి బదులు వారికిష్టమైనదానిని చేస్తే ఏమవుతుందో ఈ పుస్తకం తెలియజేస్తుంది. అసహ్యమైన పనుల దోషం ప్రజలమీద ఉన్నప్పటికీ వారిపట్ల దేవుడు చూపే కనికరం, చేసే సహాయం గురించి కూడా ఇది తెలియజేస్తుంది. పాపాన్ని దేవుడు ఎంతగా ద్వేషిస్తాడు, దానిని ఎలా శిక్షిస్తాడు అనే సంగతులను గురించి కూడా తెలియజేస్తుంది. మరో దృక్కోణంలో చూస్తే అయోగ్యులైన ప్రజలను దేవుడు ఎలా విడిపించాడు, మహా శూరులైన వ్యక్తులను ఎలా వాడుకున్నాడు అనే సంగతులను కూడా ఈ పుస్తకం తెలియజేస్తుంది.

-  కొన్ని ముఖ్య వాక్యాలు 2:10-23; 21:25.

విషయసూచిక : -

కనానులో మిగతా భూభాగాలను వశపరచుకోవడం 1:1—2:5

క్రొత్త తరంవారు విపరీతమైన మతాచారాలను అనుసరించడం 2:6-20

కనానువారిలో కొందరిని దేవుడు బ్రతకనివ్వడం 2:21—3:6

నాయకుడైన ఒతనీయేలు 3:7-11

నాయకుడైన ఏహూదు 3:12-20

నాయకుడైన షమ్గరు 3:31

నాయకులైన దెబోరా, బారాకు 4:1-24

దెబోరా గీతం 5:1-31

నాయకుడైన గిద్యోను 6:1—8:35

గిద్యోను ఒక గుర్తును కోరడం 6:11-23

గిద్యోను రెండవ గుర్తును కోరడం 6:36-40

మిద్యానువారిని గిద్యోను ఓడించడం 7:8-21

గిద్యోను ఒక విగ్రహం చేయడం 8:22-27

గిద్యోను మరణం 8:28-35

క్రూర రాజు అయిన అబీమెలెకు 9:1-57

ముండ్లపొద ఉపమానం 9:8-15

దేవుడు అబీమెలెకును దండించడం 9:52-57

నాయకుడైన తోలా 10:1-2

నాయకుడైన యాయీరు 10:3-5

ఇస్రాయేల్ తిరిగి పాపం చేయడం, పశ్చాత్తాపపడడం, దేవుని కనికరం 10:6-18

నాయకుడైన యెఫ్తా 11:1—12:7

యెఫ్తా కుమార్తె, అతడు బుద్దిహీనంగా ఇచ్చిన మాట 11:34-36

యెఫ్తా ఎఫ్రాయిం వారు 12:1-7

నాయకులైన ఇబ్సాను, ఏలోను, అబ్దోను 12:8-15

ఫిలిష్తీయవారు ఇస్రాయేలువారిని వశం చేసుకోవడం 13:1

నాయకుడైన సమ్సోను 13:2—16:31

సమ్సోను పుట్టుక 13:2-25

సమ్సోను ఫిలిష్తీయ అమ్మాయిని వివాహమాడుట 14:1-20

సమ్సోను ఒక సింహాన్ని చంపడం 14:5-6

సమ్సోను పొడుపుకథ 14:12-20

సమ్సోను ఫిలిష్తీ వారి పంటకొచ్చిన చేనులను తగలబెట్టడం 15:1-5

సమ్సోను గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపడం 15:14-20

సమ్సోను దెలీలా 16:1-21

దాగోను దేవత గుడిని సమ్సోను నేలకూల్చడం 16:23-31

మీకా విగ్రహం, ప్రతిమ, అతని యాజి, దాను ప్రజలు 17:1—18:31

గిబియాలో ఒక ఘోర సంఘటన 19:1-30

బెన్యామీన్ వారి నాశనం 20:1-48

మిగిలిన బెన్యామీన్ వారికి భార్యలు దొరకడం 21:1-25

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...