📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚
*ప్రపంచ క్రైస్తవ్యానికి సంబంధించిన తప్పక తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన సత్యాలు...*
ఈ విలువైన సమాచారాన్ని మీకందిస్తున్నవారు ట్రుథ్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఇండియా...
★ప్రపంచంలో అతి పెద్ద మతంగా కొనసాగుతున్న క్రైస్తవ్యన్ని, అనుసరిస్తున్నవారి సంఖ్య అధికారిక గణాంకాల ప్రకారం 240 కోట్లు కాగ, ఇది ప్రపంచ జనాభాలో 33% శాతం... కానీ చాలా ప్రాంతాల్లో క్రైస్తవులకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల కారణంగా బాహ్యంగా క్రైస్తవులు కనిపించట్లేదు గానీ అనధికారికంగా ఈ సంఖ్యకు మించి క్రైస్తవులున్నారు...
అలాగే 23 కోట్లా క్రైస్తవ జనాభాతో అమెరికా అగ్ర క్రైస్తవ దేశంగా నిలువుగా , 19 కోట్లా క్రైస్తవ జనాభాతో బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది...
★ ప్రపంచ క్రైస్తవ్యంలో వివిధ మతాచారా శాఖలున్నాయి, వీటినే డినమినేషన్స్ అంటారు, వీటిల్లో క్యాథలిక్ శాఖ వారు 120 కోట్ల అనుచరులతో అంటే ప్రపంచ క్రైస్తవ జనాభాలో 50%శాతంతో ముందంజలో ఉండగా, 80 కోట్లా అనుచరులతో ప్రొటెస్టెంట్ శాఖ వారు ద్వితీయస్థానంలో, 28.5 కోట్లా అనుచరులతో అర్ధోడక్స్ శాఖ వారు మూడవ స్థానంలో వున్నారు...
ఇలా చూసుకుంటుపోతే ఇంకా ఇతరత్రా చాలా షాకోపశాకాలుగా విడిపోయివున్నారు, ఈ డినమినేషన్ల యొక్క మత సంబంధిత ఆచార వ్యవహారాల్లో వ్యత్యాసం ఉన్నప్పటికి ఈ అన్ని క్రిస్టియన్ డినమినేషన్ల
కామన్ పాయింట్ మాత్రం ఒక్కటే... అదేంటంటె...
★సర్వ సృష్టికర్తయైన దేవుడు తన మహిమా నిమిత్తం నిర్మించిన మానవులు, తమకు దేవుడానుగ్రహించిన స్వేచ్ఛను దుర్వినియోగపరచుకొని, దేవుని ఆజ్ఞను అతిక్రమించి, అవిధేయులై... దేవుడిచ్చిన మహిమాను కోల్పోయి, మరణంధకారమైన పాపాన్ని కొనితెచ్చుకుని పాపం వలన వచ్చిన మరణంధకారంలో కొట్టుమిట్టాడుతు దేవునికి దూరమైయున్న స్థితిలో నుండి మానవున్ని, ఆ పాపభారం నుండి విడిపించుట కొరకై సర్వశక్తిమంతుడైన దేవుడే మానవులందరి పాప ప్రక్షాళన కోసం పరలోకం నుండి భూమిపై పరిశుద్ధ నరావతరిగా జన్మించి మనవులందరి పాపపరిహారం కొరకు ఒకేసారి అర్పింపబడే పాపపరిహారార్ధ బలిగా రక్తప్రోక్షణ గావించి , ప్రాణాన్ని పెట్టి, తన ఉచిత కృపద్వారా మనవులందరి రక్షణను అనుగ్రహించాడని ఆయనయందు విశ్వసించే ప్రతి ఒక్కరూ రక్షిపబడతారని ఈ అన్ని డినమినేషన్ల వారు విశ్వసిస్తారు... అలా విశ్వసించని వారు క్రైస్తవులు కారు...
★ఇకపోతే క్రైస్తవ జనాభా...
వాటికన్ సిటీ, పిక్టేరియన్ దీవుల్లో 100%శాతం ఉన్నప్పటికీ ఈ దేశాల్లో కేవలం 1000 కి పైచిలుకు జనాభా మాత్రమే ఉన్నందున, ఆ దేశాలను మినహాయిస్తే, 99%శాతం క్రైస్తవ జనాభాతో మొదటిస్థానంలో ఉన్న దేశం రొమేనియా, ఇక 90-99%శాతం క్రైస్తవ జనాభా కలిగి ప్రపంచవ్యాప్తంగా 49 దేశాలున్నాయి...
<<ఇక మన భారత దేశ గణాంకాలు చూస్తే >>
అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 3కోట్లకు పై చిలుకు క్రైస్తవ జనాభాతో, ప్రపంచ క్రైస్తవ దేశ జనాభా పరంగా భారత్ 22వ స్థానంలో ఉంది. అనదికారికంగా ఈ లెక్కకు మించి క్రైస్తవులు భారత్ లో వున్నారు... కానీ విచారకరమైన విషయం ఏంటంటే భారత్ లో క్రైస్తవులు మేము క్రైస్తవులం అని బహిరంగంగా ప్రకటించుకోలేకపోతున్నారు, దీనికి చాలా కారణాలు ఉండవచ్చు...
■భారత్ లో ప్రొటెస్టెంట్ క్రైస్తవులు అధికంగా విస్తరించివుండడం గమనార్హం...
★భారత్ లో అత్యధిక క్రైస్తవులున్నా రాష్ట్రంగా 61 లక్షల క్రైస్తవ జనాభాతో కేరళ మొదటి స్థానంలో ఉండగా, రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం క్రైస్తవ జనాభా మెజారిటీగా కలిగిన రాష్ట్రలు 87.9% శాతంతో నాగాలాండ్ మొదటి స్థానంలో, 87.1% శాతంతో మిజోరాం రెండవ స్థానంలో , 74.59% శాతంతో మేఘాలయా ముడవస్థానంలో ఉన్నాయి...
## ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చిలు
ప్రపంచంలో అధికారిక చర్చిలు 3 కోట్లా 70 లక్షలకు పైచిలుకు, కాగా సంఖ్యాపరంగా చూసుకుంటే ౩ లక్షల 60 వేలా అధికారిక చర్చిలను కలిగి అమెరికా సంయుక్త రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి...
★విస్తీర్ణ పరంగా ప్రపంచంలోని అతి పెద్ద చర్చ్ వాటికన్ సిటీలో గల సెయింట్ పీటర్స్ బాసిలికా, ఇది ౩౦ వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
★ప్రపంచంలో అతి ఎత్తైన చర్చ్ జర్మనీలోని Ulm Minister Church దీని ఎత్తు 161.5 మీటర్లు (అంటే 530 అడుగులు).
★ప్రపంచంలో అత్యంత సంపన్న చర్చి కాంగ్రిగేషన్ గా అమెరికాలోని సాల్ట్ లేక్ సిటిలో గల, “చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అఫ్ లాటర్ డే సెయింట్స్” ఇది 4 వేల కోట్ల సంపద కలిగివుంది...
★చర్చి సంఘ సభ్యుల ప్రకారంగా ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు కలిగిన చర్చ్ "దక్షిణ కొరియా"లోని “Yoido Full Gospel Church”
8 లక్షల క్రియాశీలక సభ్యులతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో గల ఈ చర్చికి అదివారపు ఆరాధనల్లో ఒక సెషన్ కి 2 లక్షల మంది హాజరవుతుంటారు. ప్రపంచ ప్రఖ్యాత సువార్తికుడైన “పాల్ యాంగి చొ ” గారు ఈ సంఘాన్ని 1973 లో స్థాపించారు...
★ఇక మన దేశానికి వస్తే...
మన దేశంలో అధికారికంగా గుర్తించబడిన చర్చిల సంఖ్య 10 వేలకు పై చిలుకు మాత్రమేయైనప్పటికీ, అధికారిక లెక్కల్లో కంటే అత్యధికంగా భారత్ లో చర్చిలున్నాయన్న సంగతి విదితమే...
★భారత్ లో చర్చిలు అత్యధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రం కేరళ, చర్చిల సంఖ్యపై కచ్చితమైన గణాంకాలు లేవు.
★భారత్ లో అతి పురాతన చర్చ్ అపొస్తలుడైన తోమా గారిచే క్రీ.శ. 52 లో కేరళ లో నిర్మించబడిన” “సైరో మలబార్ చర్చ్", ఇది ఇప్పటికి కేరళలోని తిరుచూర్ లో గల పలయుర్ అనే ప్రాంతంలో చెక్కు చెదరకుండా ఉంది.
★విస్తీర్ణ పరంగా భారత్ లో అతి పెద్ద చర్చి భవనం నాగాలాండ్ లోని “ సుమీ బాప్టిస్ట్ చర్చ్ ” దీన్ని 2017 లో నిర్మించారు.
★అంతర మరియు బాహ్య విస్తీర్ణం కలుపుకుంటే అతి పెద్ద చర్చిగా తెలంగాణాలోని మెదక్ జిల్లా కేంద్రంలో గల “చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా” (CSI Church) ఉండగా,
★అతి ఎత్తైన చర్చి తిరుచూర్ లోని “బసిలికా ఆఫ్ అవర్ లేడి అఫ్ డోలర్స్” , ఇది 79 మీటర్ల ఎత్తున్న గోపురం(మినార్) కలిగి, ఆసియా లోనే మూడవ పెద్ద చర్చిగా ఉంది...
★సంఘ సభ్యుల పరంగా అత్యధికులు ఆదివారపు ఆరాధనకి హాజరయ్యే చర్చ్ హైదరాబాద్ లోగల “కల్వరి టెంపుల్ “, దాదాపు లక్షన్నరకు పైగా సభ్యులు ప్రతి ఆదివారపు ఆరాధనకి వస్తుంటారు...
★చర్చి సిట్టింగ్ కెపాసిటి పరంగా కూడా భారత్ లో అతి పెద్ద చర్చిగా 18 వేల సిట్టింగ్ కెపాసిటిని కలిగివుందీ చర్చ్... దీన్ని ప్రపంచ ప్రఖ్యాతి దైవజనులు డా.పి.సతీష్ కుమార్ గారు స్థాపించారు...
★ఇక భారత్ లో అత్యంత సంపన్న చర్చ్ గా “బసిలికా ఆఫ్ బొమ్” నిలుస్తుంది ఇది గోవాలో ఉంది, 2017లో నాగాలాండ్ లోని సుమీ బాప్టిస్ట్ చర్చ్ నిర్మితం కాకముందు ఇండియా లో అతిపెద్ద చర్చ్ భవనం కూడా ఇదే... భారత్ లో సందర్శించాల్సిన ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుందీ చర్చ్... దీన్ని 17 వ శతాబ్దంలో నిర్మించారు, గోవాలోని ఈ సుందర చర్చి భవనం యునెస్కో వారసత్వ కట్టడాల్లో చోటు సంపాదించుకుంది...
##ప్రపంచంలో క్రైస్తవ దేశాలుగా క్రైస్తవ్యాన్ని అధికారిక మతంగా స్వీకరించి కలిగివున్న దేశాలు 24, అమెరికా, రష్యా మరియు యూరోప్ దేశాలు, క్రైస్తవ్యాన్ని అనుసరిస్తున్న మెజారిటీ క్రైస్తవ దేశాలే అయినప్పటికీ అవి సెక్యూలర్ దేశాలుగా కొనసాగుతున్నాయి...
★క్రైస్తవ్యం అధికారిక మతంగా ప్రకటించుకున్న మొట్టమొదటి దేశం ఆర్మేనియా, క్రీ.శ.301లో క్రైస్తవ్యన్ని అధికారిక మతంగా స్వీకరించింది...
★మరిన్ని దేశాలు క్రైస్తవ్యన్ని అధికారికమతంగా స్వీకరించి, ప్రకటించుకున్నాయి... ఆ దేశాలు ఏమంటే...
• ఆర్మేనియా (Armenia)
• అర్జెంటినా (Argentina)
• బొలివియా (Bolivia)
• జాంబియా (Zambia)
. జార్జియా(Georgia)
• కోస్టారికా (Costa Rica)
• ఎల్ సాల్వేడర్ (El Salvador)
• లిచ్టేన్స్తేన్ (Liechtenstein)
• మాల్ట (Malta)
• మొనాకో (Monaco)
. సమోయా(Samoa)
. టోంగా(Tonga)
. టువాలు(Tuvalu)
• గ్రీస్ (Greece)
• డెన్మార్క్ (Denmark)
• ఫిన్లాండ్ (Finland)
• ఐస్లాండ్ (Iceland)
. ఫారోస్ ఐస్లాండ్(Faroe Islands)
. గ్రీన్లాండ్ (Greenland)
• స్కాట్లాండ్ (Scotland)
• ఇంగ్లాండ్ (england)
• స్విట్జర్లాండ్ (switzerland)
• నార్వే (Norway)
• వాటికన్ సిటి (vatican city)
అద్భుత విషయం ఏమిటంటే పై దేశాలన్నీ ప్రపంచ శాంతి సూచికలో అగ్ర దేశాలుగా కొనసాగుతున్నాయి. ఇది క్రైస్తవుల ప్రేమా మరియు శాంతియుత జీవనానికి నిదర్శనం...
## ప్రపంచ గొప్ప క్రైస్తవా కట్టడాలు చూస్తే....
★ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రీస్తు విగ్రహం “బ్రెజిల్ లోని రియో డి జెనిరియో” లో గల “రీడిమర్ క్రైస్ట్” విగ్రహం ఇది అత్యంత ఎత్తైన కొండపై కట్టబడినందువలన భూ మట్టానికి 700 మీటర్ల ఎత్తులో బ్రెజిల్ దేశం లో ఎక్కడనుండి చూసిన కనిపించేంత ఎత్తులో ఉంటుంది కాగా దీని పొడువు 30 మీటర్లు...
★ఇక కేవలం విగ్రహ ఎత్తు పరంగా అతి పెద్ద క్రీస్తు విగ్రహం పోలాండ్ లోని "క్రైస్ట్ ది కింగ్” దీని ఎత్తు 52.5 మీటర్లు...
★ఇక ప్రపంచంలో నే అతి పెద్ద సిలువ(holy cross) అమెరికాలోని రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియాలో గల "మిలీనియం క్రాస్” కాగ అతి పెద్ద క్రిస్మస్ ట్రీ శ్రీలంకలోని కొలంబో లో 72.1 మీటర్ల ఎత్తు తో 2017 లో నిర్మించారు ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డుని కూడా సొంతం చేసుకోవడం గమనార్హం...
★భారత్ లో అత్యంత పెద్దదైన క్రీస్తు విగ్రహం 33.5 అడుగుల ఎత్తు కలిగిన కేరళలోని త్రివేండ్రంలో నలంచిర వద్ద ఉంది. దీన్ని 2012 లో ప్రేమచంద్రన్ బృందం నిర్మించింది...
(హెచ్చరిక : బైబిల్ విగ్రహారాధనను తీవ్రంగా ఖండిస్తుంది మరియు విగ్రహారాధన పాపంగా ఎంచబడింది)
##ప్రపంచంలో అరుదైన విషయాలు...
★మానవ సంచారమే కఠినంగా ఉండే అంటార్కిటిక ప్రాంతంలో 8 చర్చిలున్నాయి. గడ్డకట్టుకుపోయే మైనస్ డిగ్రీల చలిలో జనజీవనం వేసవి కాలంలో అయితే 4000లు గాను, చలికాలంలో వెయ్యి మంది గాను ఉంటుంది. వీరికోసమే ఇక్కడ చర్చిలను నిర్మించుకోవడం జరిగింది. “చాపెల్ ఆఫ్ ది స్నోస్” 1956 లో కట్టబడిన అంటార్కిటికలోనే మొట్టమొదటి చర్చ్...
★నిత్యం తన గర్భంలో రగులుతున్న నిప్పుల కుంపటిని నింపుకుని ఎప్పుడు బద్దలయ్యి లావా వెదజల్లుతుందో తెలియని “రోచేల్లి కోర్నేలి” అగ్ని పర్వతం ప్రాన్స్ దేశంలో ఉంది, దీని పూర్తి పై భాగాన “అవర్ లేడి ఆఫ్ లే పుయ్” చర్చ్ ఉంది. ఇది ౩౦౦ అడుగుల ఎత్తులో ఉంది, ఇక్కడి నుండి ఫ్రాన్సు పట్టణాన్ని అగ్ని పర్వత ముఖ ద్వారం వద్ద నిలుచుండి చూడడం ఒక సాహసిక విషయం అయితే, అక్కడ ఆరాధనలు జరగడం మరీ ఇంకా గొప్ప అద్భుతమే...
★1995 జనవరి 15 న ప్రపంచ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని పోప్ జాన్ పాల్ ౹౹ పిలుపు మేరకు బహిరంగ ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి హాజరైన ప్రజలు 50 లక్షలు, ఇది ప్రపంచ చరిత్రలోనే అతిభారీ ప్రజాకలయికగా చరిత్రలో నిలువగా, దీనికి ఫిలిప్పీన్స్ లోని మనిలా పట్టణం వేదికగా నిలిచింది...
##క్రైస్తవ్యం గురించి చింతించవలసిన మరియు ప్రార్ధించ వలసిన విషయాలు...
క్రైస్తవ్యం ప్రపంచంలో అత్యధిక అనుచరులు కలిగి ఉన్న మతంగా పేరుగాంచినప్పటికి క్రైస్తావ్యానికి బలమైన సామ్రాజ్యాలుగా ఉన్న యూరోప్ దేశాల్లో క్రైస్తవ్యం పటుత్వాన్ని నానాటికి కోల్పోతుంది. క్రైస్తవ్యా విస్తరణ రేటు 20 వ శతాబ్దంతో పోలిస్తే 21 వ శతాబ్దంలో స్తంభించిపోగా, క్రైస్తవ్యాన్ని ఆధారం చేసుకొని పుట్టుకొచ్చిన మరో మత వ్యాప్తి శరవేగంగా విస్తరిస్తుంది. 2050 వరకు ప్రపంచం లో క్రైస్తవ్యం రెండవ స్థానానికి పరిమితం అవ్వొచ్చని విశ్లేషకుల అంచనా...
ఇక ప్రపంచంలోని కొన్ని దేశాల్లో సువార్త ప్రకటించడం, క్రైస్తవ్యాన్ని ఆచరించడం నేరంగా పరిగణిస్తూ ఒక వేళా ఎవరైనా అలా చేసినా వారిని నిర్ధక్ష్యంగా చంపడంలో ఉత్తర కొరియా మొదటి స్థానంలో ఉండగా సోమాలియా రెండవ స్థానంలో ఉంది. తదుపరి దేశాలుగా ఆఫ్ఘనిస్తాన్,పాకిస్తాన్, సుడాన్,సిరియా,ఇరాక్ ,ఇరాన్, యెమెన్ లు ఉన్నాయి...
ఇక మన భారతదేశ విషయానికి వస్తే క్రైస్తవులపై దాడులు చెయ్యడం, హింసించడం, చంపడం విషయల్లో ప్రపంచంలో 15 స్థానంలో ఉంది. మధ్య,మరియు ఉత్తర భారతం లోని హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, బిహార్ తదితర రాష్ట్రాల్లో క్రైస్తవుల సంఖ్య 1% శాతం కూడా లేదు. అక్కడి పాలకుల అసాంఘిక చట్టాలు, అలౌకిక భావాలు సువార్త వ్యాప్తికి ఆటంకాలుగా మారుతున్నాయి....
కాబట్టి సర్వప్రపంచ ప్రజాక్షేమం మరియు మారుమనస్సు కోసం అలాగే ప్రపంచ శాంతికాముకులైన క్రైస్తవుల సంక్షేమం మరియు సువార్త విస్తరించబడడం కొరకు సహృదయంతో మీ దైనందిన ప్రార్దనల్లో జ్ఞాపకం చేసుకోండి, ప్రభు చిత్తంనందు జరగవలసిన సంగతులన్నీ జరుగులాగున, మన ప్రభు రాకడ సమయం వరకు విశ్వాసంతో అంత్యదిన శ్రమలందు ఓర్పుకలిగి సహనంతో నిరీక్షణ గలవారమై , మన నిరీక్షణకు ఆధారమైయున్న ప్రభువుతో కూడా పరము చేరే మార్గములో నిష్ణాత్తులై, రక్షణ అనే శిరస్త్రాణమును, విశ్వాసమనే డాలును ధరించుకొని యుందము...ఆమెన్...
💫 *దేవుని కే మహీమ కలుగును గాక అమెన్*✨
👉 *సేకరణ*
*బ్రదర్ సముయేలు*
📖 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి*📖
💐 *మీ స్నేహితులకు షేర్ చేసి మీ వంతు దేవుని పని చేయ్యండి*💐
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి