ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రూతు. పరిచయం

రూతు

పరిచయం

రచయిత, వ్రాసిన కాలం:
- యూదుల సాంప్రదాయం ప్రకారం సమూయేలు ఈ పుస్తకాన్ని వ్రాశాడు, అయితే అలా అనడానికి సాక్ష్యాధారాలు లేవు. అలాగే ఏ కాలంలో దీనిని వ్రాయడం జరిగిందో కూడా ఖచ్చితంగా చెప్పలేము.

ముఖ్యాంశాలు:

- ఒక ముఖ్యాంశం వ్యక్తులమధ్య ఉన్న దయ, ప్రేమ, వాటి ఫలితాలు. 

- మరో ముఖ్యాంశం – ఇతర ప్రజలలో ఒకరైన రూతు యెహోవాను విశ్వసించి దేవుని ప్రజలలో ఒకరు కావడం. రూతు దేవుని రాజ్యంలో ప్రవేశించడం మాత్రమే కాకుండా, దావీదుకు ప్రభువైన యేసుకు పూర్వ జనని అయింది. 

- మరో ముఖ్యాంశం – విడిపించగల బాధ్యతగల సమీప బంధువు. ‘విడిపించగల బంధువు’ క్రీస్తును పోలిన నమూనాలో ఉన్నాడు. 2:20 దగ్గర ఉన్న నోట్‌ను చూడండి.
2:20 లో ఉన్న నోట్  : - { సమీప బంధువుడు”– ఈ చిన్న పుస్తకంలోని మరో పెద్ద అంశం ఇది. “గొయేల్” అనే ఒక్క హీబ్రూ పదానికి అనువాదం “విడిపించగల బంధువు” లేక “విమోచకుడు” లేక “సమీప బంధువుడు” లేక “ముక్తిదాత”. “పగ తీర్చుకొన్నవాడు” “ప్రతీకారం చేసేవాడు” అని కూడా ఈ పదం అనువదించబడింది. ఈ అర్థాలన్నీ ఈ పదంలో ఉన్నాయి. ఈ సమీపబంధువుడి బాధ్యతలు లేవీ 25:25-28, 47-49; సంఖ్యా 35:19-21; ద్వితీ 25:5-10లో కనిపిస్తాయి. న్యాయానికీ పవిత్రతకూ అనుగుణంగా తన కుటుంబం, బంధువుల క్షేమాన్ని చూసుకోవాలి. యేసుప్రభువు ఆయన రెక్కల క్రింద ఆశ్రయించినవారందరికీ సమీప బంధువుడు, విమోచకుడు. వారిని పాపం అనే దాస్యంనుంచి విడిపించి, వారు తమ పాపం ద్వారా పోగొట్టుకున్నదాన్ని వారికి సమకూర్చి, తనతో వారసత్వం వారికిచ్చి, వారి శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటాడు.}

- విడిపించేవాడు తప్పక సమీప బంధువు అయి ఉండాలనే నియమముంది. 
- క్రీస్తు మానవుడయ్యాడు (హీబ్రూ 2:9-18). 
కోల్పోయిన సొత్తును తిరిగి సంపాదించుకోవడానికి తగిన సామర్థ్యం, అనుకూలత ఆ బంధువుకు ఉండాలి (రూతు 4:2-10). క్రీస్తుకు మాత్రమే విమోచన క్రయధనాన్ని చెల్లించగల సామర్థ్యం ఉంది (కీర్తన 49:7-9; 1 పేతురు 1:18-19). 
‘- విడిపించగల బంధువుడు’ విడిపించడంలో వెల చెల్లించడానికి ఇష్టపడాలి (4:4, 6, 9). మన విమోచనార్థం క్రీస్తు వెల చెల్లించడానికి ఇష్టపడ్డాడు (మత్తయి 20:28; యోహాను 10:11, 17, 18). ‘
- విడిపించగల బంధువు’ చనిపోయిన బంధువుని భార్యను పెళ్ళిచేసుకోడానికి ఇష్టపడాలి. ఆత్మ సంబంధమైన భావంలో దీనిని కూడా క్రీస్తు నెరవేరుస్తున్నాడు. చూడండి రోమ్ 7:1-4.

విషయసూచిక : -

ఒక యూదా కుటుంబానికి కలిగిన విపత్తు 1:1-5

రూతు నయోమిని, నయోమి దేవుణ్ణి అనుసరించడానికి నిర్ణయం 1:6-18

వారు బేత్లెహేము రావడం 1:19-22

బోయజు పొలాలలో రూతు 2:1-23

రూతు కోసం నయోమి తగిన ఏర్పాటు చేయడం 3:1-6

విడిపించగల బంధువు అయిన బోయజు 3:7-18

కోల్పోయిన సొత్తును తిరిగి కొని రూతును బోయజు పెండ్లాడాడు 4:1-13

రూతు రాజైన దావీదుకు పూర్వజనని అయింది 4:13-21

కామెంట్‌లు