ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ప్రవచన నెరవేర్పు:సుమయోను

ప్రవచన నెరవేర్పు:సుమయోను 🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯 💫డిశంబర్ ఇరవై ఐదవ తారీఖును క్రిస్మస్ పండుగగా లోకమంతా ఆచరిస్తుంది! యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించి ఇంచుమించు రెండువేల సంవత్సరములు అయినదని అందరూ గుర్తిస్తున్నారు. అయితే యేసుక్రీస్తు క్రొత్తగా వచ్చిన దేవుడుగానే అనేకులు భావిస్తున్నారు గాని, జగత్పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు ఉండెను. ఆదాము, హవ్వలు పాపము చేసినప్పుడే దేవుడు సర్పము రూపములో ఉన్న సాతానుతో - నీ సంతానమునకు, స్త్రీ సంతానమునకు వైరము కలుగజేతునని చెప్పెను (ఆదికాండము 3:15). కన్యయైన మరియ గర్భవతియై కుమారుని కనును; ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించునను విషయము అప్పుడే నిర్ణయించబడెను.  💫ప్రవచనముల నెరవేర్పుగా యేసుక్రీస్తు జన్మించినప్పుడు ప్రథమ ఫలమైన క్రీస్తు యెరూషలేములోని దేవాలయంలోనికి తీసుకొని రాబడెను. “యెరూషలేము నందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై యుండి, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు; పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి యుండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి...
ఇటీవలి పోస్ట్‌లు

హేరోదు రాజులకు చరిత్ర

హేరోదు రాజులకు చరిత్ర 🎯🎯🎯🎯🎯🎯🎯🎯 💫1. ఘనుడైన హేరోదు 🛑🛑🛑🛑🛑🛑🛑🛑 ప్రభువైన యేసు జన్మించిన  సమయములో ఇతడు యూదయ దేశమును పరిపాలించెను (మత్తయి 2:1-20) హేరోదు రాజుకు హత్యలంటే బహు తమాషాగా ఉoటుంది. ఈయన గారు ఎంత కౄరమైన వ్యక్తో ఈ చరిత్ర చెప్పకయే చెబుతుంది.  🔸1. తన ఐదుగురు భార్యల్లో ఒకరైన మేరియామును చంపించాడు.  🔸2. తన ముగ్గురు కుమారులను లాభము కోసము హత్య చేశాడు.  🔸3. తన అత్తగారిని కూడ హతమార్చాడు. 🔸4. తన బావమరిదిని, చిన్నాన్నను మరెందరినో హతమార్చినవాడు.  🔸5. చివరికి యేసు క్రీస్తును కూడా చంపాలనే ఆలోచనతో బెత్లేహాము దాని సకల ప్రాంతముల యందు నివసించు రెండు సంవత్సరముల లోపు చిన్న పిల్లల్ని చంపించాడు (మత్తయి 2:16) . ఇతడెంత కౄరుడో ఆలోచించండి.  💫2. హేరోదు అర్కెలాయు  🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶 మహా హేరోదు యొక్క పెద్ద కుమారుడు. అంతిపయ యొక్క సహోదరుడు. తండ్రి చనిపోయిన తరువాత ఇదూమయ యూదయ దేశములకు అధిపతిగా చేయబడెను, యేసేపు, మరియ. యేసు ఐగుప్తును విడిచి వెళ్ళిన సమయంలో ఇతడు యూదయ దేశమును 10 సంవత్సరములు పరిపాలించెను (మత్తయి 2:22) మిగుల క్రూరుడు. దుష్ట - కార్యముల కొరకు దేశము నుండి వ...

పెళ్ళి చేసుకోవాలనుకునే అమ్మాయిలారా,*ముందు క్రింది విషయాలు ఆలోచించండి.మీరలా ఉండటం మీకు ఇష్టమైతే పెండ్లి చేసుకోండి.అనవసరంగా మీరు ఇబ్బందిపడి,ఎదుటివారిని ఇబ్బంది పెట్టి,దేవుని నామానికి అవమానం తేవడమెందుకు చెప్పండి?

*పెళ్ళి చేసుకోవాలనుకునే అమ్మాయిలారా,* ముందు క్రింది విషయాలు ఆలోచించండి. మీరలా ఉండటం మీకు ఇష్టమైతే పెండ్లి చేసుకోండి. అనవసరంగా మీరు ఇబ్బందిపడి, ఎదుటివారిని ఇబ్బంది పెట్టి, దేవుని నామానికి అవమానం తేవడమెందుకు చెప్పండి? 1.శారా వలె భర్తను గౌరవించాలి. 2.రిబ్కా వలె పరిచర్య చేయాలి. 3.లేయా వలె ఓర్పు కలిగి ఉండాలి. 4.హెబ్రీ స్త్రీలవలె ఆత్మీయతలో   చురుకుదనం కలిగియుండాలి. 5.యెఫ్తా కుమార్తె వలె సమర్పణ కలిగి ఉండాలి. 6. దెబోరా వలె కుటుంబములో,సంఘములో తల్లి వలె ఉండాలి. 7.రూతూ వలె అత్తను హత్తుకొని ఉండాలి. 8.హన్నావలె ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. 9.యాయేలు వలె ధైర్యంగా ఉండాలి. 10షూనేమియురాలివలె దైవజనులకు ఆతిధ్యం ఇవ్వాలి. 11.ఎస్తేరు వలె అందరి దయను సంపాదించుకోవాలి. 12.గుణవతియైన భార్యవలె కుటుంబమును  క్రమశిక్షణతో నడిపించాలి. 13.ఎలీసబెతు వలె అన్ని విషయాలలో భర్తతో కలిసి నడవాలి. 14.మరియ వలె ప్రభువు పాదాలయొద్ద నేర్చుకోవాలి. 15.ఫీబే వలె సంఘములో పరిచర్య చెయ్యాలి. 16.ప్రిస్కిల్ల వలె వాక్య జ్ఞానం కలిగి వుండాలి. 17.మరియవలె క్రీస్తు సువార్తను ప్రకటించాలి. 18.సలోమీ వలె ఆత్మీయమై ఉన్నతిని కోరుకోవాలి. 19.పె...

క్రీస్తు_శాస్త్రము_పార్ట్-3

#క్రీస్తు_శాస్త్రము_పార్ట్-3 ""కుమారుని యొక్క నామములు"" ఈ అధ్యాయం యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం యేసుప్రభువును దేవునిగా, మనవునిగా, మెస్సయ్యగా, రక్షకునిగా ప్రత్యక్షపరచడానికి వ్రాయబడినది. ఈ నాలుగు విషయాలలో యేసయ్య యొక్క గుణ లక్షణములను, కార్యములను, వైఖరులను అర్థం చేసుకోవడానికి ఈ పేర్లు మనకు ఉపయోగపడతాయి. ""1. దేవునిగా"" 1. సర్వాధికారి - ప్రకటన 1:8. 2. అల్ఫా ఒమెగా - ప్రకటన 1:8-11 3. మహావృద్ధుడు - దానియేలు 7:22 4. యెహోవాదూత - ఆదికాండము 16:9 5. దూత - ఆదికాండము 48:16 6. సన్నిధిదూత - యెషయా 63:9 7. యెహోవా బాహువు - ప్రకటన 1:8-11 8. ఆదియును అంతమును - ప్రకటన 1:8 - 11 9. సృష్టికి ఆది ప్రకటన 3 :14 10. అద్వితీయ కుమారుడు - యెహాను 1:14 11. ఆత్మలకాపరి, అధ్యక్షుడు 1 పేతురు 5:4 12. శ్రీమంతుడు - 1 తిమోతి 6:15 13. దేవుని మహిమ యొక్క తేజస్సు - హెబ్రీ పత్రిక 1:3 14. యెహోవా సేనాధిపతి - యెహోషువ 5:14 15. దేవుని క్రీస్తు - లూకా 9:20 17. దేవుని జ్ఞానము - 1 కొరింథీ 1:24 18. పరమాత్మ కుమారుడైన క్రీస్తు - మార్కు 14:61 19. ఇమ్మానుయేలు - మత్తయి 1:23 20. దేవుని తత్వము యొక్క మూర్తి - హెబ్రీ ...

క్రీస్తు_శాస్త్రము_పార్ట్-2

"#క్రీస్తు_శాస్త్రము_పార్ట్-2 దైవ కృత్యాలు (Divine Offices): #దేవుడు_మాత్రమే_చేయగలిగే_కార్యములు 1. సృష్టించుట (Creation): యేసు ప్రభువు సృష్టికర్త.  సృష్టించబడిన వ్యక్తి సృష్టి చేయలేడు.  (హెబ్రీ 1:10; యోహాను 1:3; కొలస్సీ1:16).  దేవుని కుమారుడే నిత్య వాక్యము. ఆయనే సృష్టికర్త. 2.పాపక్షమాపణ (Forgiveness) : యేసుక్రీస్తు ప్రభువు పక్షవాయువుగలవాన్ని బాగు చేసినప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయని వానితో చెప్పాడు. అప్పుడు అక్కడున్నవారు దేవుడు ఒక్కడే గదా పాపాలు క్షమించగల సమర్ధుడు, ఈయన దేవదూషణ చేస్తున్నాడని సణుగుకొనిరి. అప్పుడు ప్రభువు తనకు పాపాలను క్షమించే అధికారం ఉంది అని నిక్కచ్చిగా చెప్పారు.  (మార్కు 2:5-10; లూకా 7:48; ప్రకటన 1:6). 3. నిర్వాహకుడు (Administrator) : దేవుడు సృష్టికర్త మాత్రమే కాదుకాని, సృష్టిని భద్రపరిచి, సంరక్షించి, పోషించి, నిర్వహిస్తున్నవాడు (హెబ్రీ 1:2-4).  యేసుక్రీస్తు తన మహత్తుగల మాటచేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. 4. నిత్యజీవ ప్రదాత (Life giver ) : దేవుడు నిత్యుడు. ఆయనలోని జీవం నిత్యం నిలిచేది. మానవులకు ఆయన నిత్యజీవాన్ని ప్రసాదిస్తాడు. (యోహాను 10:28; య...

చంద్రుడిపైకి తీసుకెళ్ళినా మొట్టమొదటి బైబిల్

*చంద్రుడిపైకి తీసుకెళ్లినా మొట్టమొదటి బైబిల్* 🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔻🔻 🔻భూమిపైనే కాదు అంతరిక్షంలో చంద్రుడి పై కూడా విద్యుత్ బల్బ్ వెలుగులో చూడబడి చదవబడిన మొట్టమొదటి గ్రంధం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంధమైన బైబిల్ మాత్రమే అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది... 🔻ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) పరిశుద్ధ గ్రంధాన్ని (The Holy Bible) ఫిబ్రవరి 1971 అపోలో మిషన్ 14 (NASA's February 1971 Apollo 14 mission) ద్వారా【1×1inch (2.5/2.5.Cm)】ఇంచ్ పరిమాణం గల మూడువందల (300 Bible's) బైబిల్స్ ని అంతరిక్షం (Space) లోకి పంపించారు... 🔻అంతరిక్షంలోకి తీసుకెళ్లిన బైబిల్స్ అతి సూక్ష్మమైన ఛాయాగ్రహణా (Microfilm) లో 1,245 పేజీలు మరియు 773,746 పదాల నిడివి (Length) తో ఒక్కో బైబిల్ ని ముద్రించి అలా 300ల బైబిల్స్ ని , మహోన్నతుడైన మహా దేవుని కృపతో చంద్రుడిపై నడిచిన అస్ట్రోనాట్ ఎడ్గర్ మిచెల్ (Edgar Mitchell) కృషి వలన అపోలో ప్రేయర్ లీగ్ ( Apollo Prayer League ) సహకారంతో అంతరిక్షంలోకి తీసుకువెళ్లడం జరిగింది... 🔻అలాగే నాసా అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో నమ్మకమైన క్రీస్తు విశ్వా...

రెండవ క్రూరమృగము(అబద్ధ ప్రవక్త )

రెండవ క్రూరమృగము(అబద్ధ ప్రవక్త ) 🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯 మరియు భూమిలోనుండి మరియొక క్రూరమృగము పైకివచ్చుట చూచితిని. గొఱ్ఱపిల్ల కొమ్మువంటి రెండు కొమ్ములు దానికుండెను; అది ఘటసర్పమువలె మాటలాడు చుండెను; అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధి కారపు చేష్టలన్నియు దానియెదుట చేయుచున్నది; మరియు చావుదెబ్బతగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశమునుండి భూమికి మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రదికిన యీ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనలవలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొపటియందైనను ముద్ర వేయించుకొనునట్లును, ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరై...