హేరోదు రాజులకు చరిత్ర
🎯🎯🎯🎯🎯🎯🎯🎯
💫1. ఘనుడైన హేరోదు
🛑🛑🛑🛑🛑🛑🛑🛑
ప్రభువైన యేసు జన్మించిన సమయములో ఇతడు యూదయ దేశమును పరిపాలించెను (మత్తయి 2:1-20) హేరోదు రాజుకు హత్యలంటే బహు తమాషాగా ఉoటుంది. ఈయన గారు ఎంత కౄరమైన వ్యక్తో ఈ చరిత్ర చెప్పకయే చెబుతుంది.
🔸1. తన ఐదుగురు భార్యల్లో ఒకరైన మేరియామును చంపించాడు.
🔸2. తన ముగ్గురు కుమారులను లాభము కోసము హత్య చేశాడు.
🔸3. తన అత్తగారిని కూడ హతమార్చాడు.
🔸4. తన బావమరిదిని, చిన్నాన్నను మరెందరినో హతమార్చినవాడు.
🔸5. చివరికి యేసు క్రీస్తును కూడా చంపాలనే ఆలోచనతో బెత్లేహాము దాని సకల ప్రాంతముల యందు నివసించు రెండు సంవత్సరముల లోపు చిన్న పిల్లల్ని చంపించాడు (మత్తయి 2:16) . ఇతడెంత కౄరుడో ఆలోచించండి.
💫2. హేరోదు అర్కెలాయు
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
మహా హేరోదు యొక్క పెద్ద కుమారుడు. అంతిపయ యొక్క సహోదరుడు. తండ్రి చనిపోయిన తరువాత ఇదూమయ యూదయ దేశములకు అధిపతిగా చేయబడెను, యేసేపు, మరియ. యేసు ఐగుప్తును విడిచి
వెళ్ళిన సమయంలో ఇతడు యూదయ
దేశమును 10 సంవత్సరములు పరిపాలించెను
(మత్తయి 2:22) మిగుల క్రూరుడు. దుష్ట
- కార్యముల కొరకు దేశము నుండి వెల్లగొట్టబడి
అక్కడనే మృతిపొందెను.
💫 3. హేరోదు ఫిలిప్పు
🔷🔷🔷🔷🔷🔷🔷
మహా హేరోదు మేరియాముల కుమారుడు. హేరోదియ పెనిమిటి (మత్తయి 14:3) హేరోదియ తరువాత ఫిలప్పును విడిచి ఇతని అన్నయగు హేరోదు అంతిపతో జీవించెను (మత్తయి 14:3, మార్కు6:17, లూకా 3:19) మేరియాము తనపై కుట్ర
చేయుచున్నదని మహా హేరోదు ఆమెను
చంపించుట మాత్రమే ఆమె కుమారుడగు
ఫిలిప్పునకు రాజ్యము యందు ఎట్టి భాగము
ఇయ్యలేదు.
💫4. హేరోదు అంతిపయ
🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠
మహా హేరోదు యొక్క రెండవ
కుమారుడు. మల్లాకే అను ఇతని తల్లి
సమరయురాలు. తండ్రి చనిపోయిను పిమ్మట
గలిలయ పెరీయదేశములకు అధిపతిగా
నియమింపబడి 39 సం.లు రాజ్యము
చేసెను(లూకా3:1). యేసు ఇతనిని నక్క అని
పిలిచెను (లూకా 13:31-32). ఇతడు చాలా
యుక్తిగలవాడు. అరబీదేశపు రాజైన అరెతా
యొక్క కుమార్తెను వివాహమాడెను
గాని, తరువాత తన తమ్ముడగు ఫిలప్పు
భార్యయైన హేరోదియను ఉంచుకొనేను
(మత్తయి 14:3). అరెతా రాజు ఇందు
నిమిత్తము కోపగించి దండెత్తి వచ్చి హేరోదు
అంతిపయను గొప్ప యుద్ధమున ఓడించెను.
హేరోదియ చేసిన కుయుక్తి కాకుండా,
శిరచ్ఛేదన (తలనరికే) శిక్షకు కారకుడయ్యెను.
ఆమె ప్రేరేపణ చేతనే ఇతడు రాజు అను బిరుదు
కొరకు రోమా పట్టణమునకు వెళ్ళి చక్రవర్తి
కోపమునకు గురియై తన దుష్టపనులకు ఫలితముగా దేశ భ్రష్టుడాయెను.
💫5.మొదటి హేరోదు అగ్రిప్ప
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
మహా హేరోదు యొక్క మనుమడు. ఇతని తండ్రియగు ఆరిస్తోబ్యులనును మహా హేరోదు
కుమారుడనియైనను చూడక చంపించెను.
హేరోదు అగ్రిప్ప పెంచబడునిమిత్తము రోమాకు
పంపబడెను. హేరోదు అంతిపయ తర్వాత
ఇతడు యూదయ సమరయ దేశములకు
అధిపతిగా ఉండెను. ఇతడు అన్ని విధముల
చేతను యూదులను సంతోష పెట్టేవాడు.
అందుకే యోహాను సహోదరుడైన యాకోబును
ఖడ్గముతో చంపించెను (అపోస్త 12:1),
పేతురును చంప ప్రయత్నించెను (అపోస్త
12:2-19) తాను దేవునిగా పూజింపబడుటకు
సమ్మతించెను. ప్రజల ఆరాధనను స్వీకరించి
దేవుని మహిమపరచనందున, ప్రభువు దూత
ఇతనిని మొత్తగా పురుగులు పడి చనిపోయెను,
(అపోస్త 12:21-23)
💫6. రెండవ హేరోదు అగ్రిప్ప
⭕⭕⭕⭕⭕⭕⭕⭕
మొదటి హేరోదు అగ్రిప్ప
యొక్క కుమారుడు. ఇతడు ఫిలిప్పు
లుసానియము ఏలుచుండిన భాగములకు అధివతి ఆయెను. ఇతని ఎదుటనే అపొస్తలుడైన పౌలు “తాను ఏ విధముగా క్రీస్తును అంగీకరించినది “వివరించెను. (అపొస్త25:13-26:32)“ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచు చున్నావే! " అని రెండవ హేరోదు అగ్రిప్ప, పౌలుతో అనెను. యెరుషలేమును రోమీయులు ముట్టడించినపుడు' ఇతడు రోమీయుల పక్షమునచేరేను. ఇతడు రోమా పట్టణమునకు వెళ్ళి అక్కడ నే క్రీ.శ. 100 నం.ల మృతిపొందెను.
దేవుని కి స్తోత్రం 👏బ్రదర్ చాలా సంతోషం గా వుంది మి పరిచర్య
రిప్లయితొలగించండిఐతే నాకు పెద్ద సందేహం. బ్రదర్
దేవుని మందిరం లో. సేవకునిపై. ఆయన పరిచర్య. పై సంఘపెద్దలు. పెతనంము చేయవచ్చని ఒక సంఘపెద్ద
పెతనం చేస్తుంటే. యేసు ప్రభువు కు మరి. సేవకుడు ఎందు కో. దయతో చెపగలర బ్రదర్. అసలు సంఘం లో. సేవకునికి బైబిల్ లో స్థానం ఎంటి బ్రదర్. చెప్పండి బ్రదర్. దయతో తప్పుగా అనుకోవద్దు బ్రదర్ 🙏