ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పాముల ఆహారం మన్నేనా?

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚

🐍 *"పాముల ఆహారం మన్నేనా?"*💠

  

అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడినదానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నియు మన్ను తిందువు. '' [పాములు మన్ను తినవు. చచ్చిపోయేలోగా మనము ధూళి రేణువులను తిన్నట్లే అవి కూడ తింటే తినవచ్చు. అంతమాత్రాన సర్పాలకు మన్ను ఆహారం అనలేము. యెషయా 65:25 కూడ సర్పములు మన్ను తినును అంటున్నవి]


        👉    *జవాబుః*
 దైవ స్వహస్తాలతో రూపించబడి దైవత్వముతో నింపబడి పరిశుద్ధులైన నరులను అపరిశుద్ధమైన వాక్కులతో మోసగించి వారిని పెడదారి పట్టించి మరణ మార్గములకు నడిపించి మరణ పాపులుగా చేసింది సర్పము. ఈ విధముగా దైవ సంభూతులైన నరజంటను శాప మరణానికి దిగజార్చినందుకు ఆది 3:14 లో వలె దేవుడు తన సన్నిధిలో పాముకు విధించిన తీర్పు మనము చదువగలము. ఇది కఠిన కారాగార శిక్ష మరియు వికలాంగత్వముతో కూడిన శిక్ష.

 
 మట్టి తినడమంటే మనుష్యుల మధ్యలో నిర్భయంగా తిరుగవలసిన సర్పము మనుష్యులకు దూరంగా ప్రాణభయముతో మట్టి పుట్టలలో నివసించుటయే. అలాగే పాములు ఏ ఆహారమును తతినినను అవి మట్టినుండి వచ్చినవే కనుక అవి మట్టితో సమానము. ఈ లోక ఆహారము వేరు పరలోక ఆహారము వేరు. ఈ లోక ఆహారము అది ఏ రూపములో కనిపించినను అది మన్ను నుండి వచ్చినదే. చివరికి అది మన్ను గానే మారును అని ప్రసంగి చెప్పుచున్నాడు. అదే విధముగా నరులు కూడ తన ఆహారమును ఆహారము యొక్క ప్రాధాన్యతను పోగొట్టుకొని భూమిని దున్ని చెమటోడ్చి సేద్యము చేసి దాని ఫలమును తినవలసిన గతి ఏర్పడింది. ఇది సర్పజాతికిని, మానవ జాతికి కూడా దేవుడు విధించిన శిక్ష.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...