ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

శాస్త్రవేత్తలు కనుగొన్నా విషయాలు బైబిల్ ముందే చెప్పింది

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚


1️⃣ ) భూమి శూన్యంలో వ్రేలాడుతుందని కోపర్నికస్ అనే శాస్త్రవేత్త క్రీ.శ. 1475 లో కనుగొన్నాడు. ఇదే విషయాన్ని ఎన్నో విజ్ఞాన విషయములు కనుగొన్న “సర్ ఐజక్ న్యూటన్” కూడా 17వ శతాబ్దములో భూమి శూన్యంలో వ్రేలాడుతుందని నిరూపించి తెలియజేసాడు. అప్పటి నుంచి విద్యార్ధులకు భూమి శూన్యంలో వ్రేలాడుతుందని చెప్పడం ప్రారంభించారు. అయితే ఇదే విషయాన్ని “పరిశుద్ధ గ్రంధమైన బైబిలు” క్రీ.పూ. 1500 సంవత్సరాల క్రితమే “యోబు” గ్రంధములో తెలియజేసింది.

👉 శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశవిశాలమును ఆయన పరచెను శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను. (యోబు 26:7)

2️⃣ ) భూమి గుండ్రముగా ఉందని క్రీ. పూ. 3వ శతాబ్దంలో అరిస్టాటిల్ కొన్ని పరిశోధనలతో తెలియజేసినప్పటికి, కాదు బల్లపరుపుగా ఉందని మరి మరికొందరు శాస్త్రవేత్తలు క్రీ.శ. 16వ శతాబ్దము వరకు వాదిస్తూనే ఉన్నారు. ఇలాంటి వాదనలు ఉన్న సమయములో “గెలీలియో” అనే శాస్త్రవేత్త క్రీ.శ. 16వ శతాబ్దములో పలు ప్రయాసల చేత భూమి గుండ్రముగా ఉందని నిరూపించాడు. ఇదే విషయాన్ని “దైవ గ్రంధమైన బైబిలు” క్రీ.పూ. 1500 సంవత్సరాల క్రితమే  “యోబు” గ్రంధములో తెలియజేసింది.

👉 ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్య మైన భూగోళము మీద మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెర వేర్చును (యోబు 37:12).

👉 ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు. (యెషయా 40:22)
He that sitteth upon the circle of the earth (Issiah 40:22)

3️⃣ ) విలియం హార్వే క్రీ.శ. 1628 లో ప్రాణం రక్తములో ఉన్నదని చెప్పాడు. క్రీ.పూ. 14వ శతాబ్ధములోనే ఈ విషయాన్ని దేవుడు మోషే ద్వారా తన గ్రంధములో వ్రాయించాడు. (ఆదికాండము 9:4,5; లేవికాండము 17:11)

👉 రక్తము దేహమునకు ప్రాణము (లేవీకాండము 17:11)

4️⃣ ) టెలీస్కోప్ ను కనిపెట్టకముందు మరియు కనిపెట్టిన (క్రీ.శ. 1600) తరువాత చాలా మంది నక్షత్రాలను లెక్కపెట్టడానికి ప్రయత్నించారు. ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి, ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు క్రీ.శ. 20వ శతాబ్దములో నక్షత్రాలను లెక్కించలేమని విజ్ఞాన శాస్త్రవేత్తలు తెలియజేసారు. నక్షత్రాలను లెక్కించడం వీలు కాదని బైబిలు క్రీస్తు పూర్వమే తెలియజేసింది. (ఆదికాండము 15:5, యిర్మియా 33:22)

👉 ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుకరేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్యచేయు లేవీయులను లెక్కింప లేనంతగా నేను విస్తరింపజేయుదును. (యిర్మియా 33:22)

5️⃣ ) 21వ శతాబ్దములో శాస్త్రవేత్తలు పరిశోధించి ఒక నక్షత్రమునకు, మరొక నక్షత్రమునకు బేధము కలదని, ఒకొక్క నక్షత్రము వేరు వేరు ఉష్ణం, కాంతి గలవని చెప్పకముందే బైబిలులో పరిశుద్దాత్మ దేవుడు ఈ విషయములను వ్రాయించాడు.

👉 నూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమవేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమనుబట్టి యొక నక్షత్రమునకును మరియొక సక్షత్రమునకును భేదముకలదు (1 కొరింథీ 15:41)

6️⃣ ) క్రీ.శ. 1783 లో జోసెఫ్ మౌంట్ మరియు జాక్వస్ “బలూన్ (Balloon)”ని కనుగొన్న తరువాత గాలికి బరువు ఉన్నాదని ప్రపంచం మొత్తం తెలుసుకున్నారు. వీరు ఈ విషయాలను కనిపెట్టక పూర్వమే పరిశుద్ధ గ్రంధం బైబిలు క్రీ.పూ. 1500 సంవత్సరాల క్రితమే తెలియజేసింది.

👉 గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించి నప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు (యోబు 28:25)

7️⃣ ) సముద్ర జలములు సూర్యవేడిమి చేత ఆవిరిగా మారి, మేఘములుగా మారి వర్షం కురిసి నదులు, సముద్రాలు నిండుతున్నాయి అని ఇది ఒక జల చక్రం అని క్రీ.శ. 17వ శతాబ్దములో మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ విషయాన్ని బైబిలు క్రీస్తు పూర్వమే తెలియజేసింది. (కీర్తనలు 135:7; ప్రసంగి 1:7; యిర్మియా 10:13; యోబు 36:28).

👉 నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును (ప్రసంగి 1:7).

👉 భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలోనుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును. (కీర్తనలు 135:7)

👉 ఇలాంటి విషయాలు ఎన్నో బైబిలులో కలవు. ఇవి కేవలం కొన్ని మాత్రమే. నేటి మానవులు అనేక పరికరాల ద్వారా, పరిశోధనల ద్వారా, టెక్నాలజీ ద్వారా “విశ్వ సంబందిత” విషయాలను కనుగొంటున్నారు. అయితే బైబిలు వ్రాసిన వ్యక్తులు ఎలాంటి టెక్నాలజీ లేని సమయములోనే, ఎలాంటి పరిశోధనలు లేకుండానే విశ్వ సంబందిత విషయాలను మరియు భవిష్యత్తు ప్రవచనాలను తెలియజేసారు. ఇదెలా సాధ్యం?⤵️

👉 ఎందుకంటే వ్రాసింది వ్యక్తులే అయినా, వారి చేత వ్రాయించింది మాత్రం దేవుడే. అందుకే బైబిలును దైవ గ్రంధం అని, ఇలాంటి విషయాలను దేవుడు మాత్రమే ముందుగానే వ్రాయించగలడని కొన్ని శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు  తమ నోటితో ఒప్పుకొంటూనే ఉన్నారు.
అందును బట్టి  బైబిల్ ని ఊరికే విమర్శించే వట్టి మాటలు కట్టిపెట్టి బైబిల్ ని చదివి నిత్యజీవానికి మార్గన్ని కనుగొనండి... అప్పుడు మీరే మీ నోటితో ఒప్పుకుంటారు బైబిల్ మాత్రమే సత్యం అని...

సమస్త మహిమ మన దేవునికే కలుగునుగాక, ఆమెన్...
.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...