ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యేసు క్రీస్తు సిలువ మరణం వివరములు

✝️ *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📖



👉 యేసు క్రీస్తు సిలువ మరణం వివరములను ఒక క్రమములో అర్థము చేస్కోవడానికి, అధ్యాత్మిక పరిశీలనకు ఈ సందేశం తప్పకుండా ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాము, ప్రతి ఒక్కరు తప్పకుండా చదవండి. 

యేసు క్రీస్తు సిలువ మరణం గురించి ఏ సువార్తలో కూడా పూర్తిగా వ్రాయబడలేదు. ఒక్కో సువార్తలో కొద్ది కొద్ది భాగం మాత్రమే వ్రాయబడినది (ఉదా: యేసు క్రీస్తు సిలువలో పలికిన 7 మాటలు ఏ ఒక్క సువార్తలో కూడా పూర్తిగా లభించవు. 4 సువార్తలను పరిశీలిస్తే సిలువలో 7 మాటలు పలికారని తెలుస్తుంది.)

యెషయా 28:13 ప్రకారం యెహోవా వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట లభించును, కనుక ఈ 4 సువార్తలను క్షుణ్ణముగా పరిశీలిస్తే యేసు క్రీస్తు సిలువ మరణ వివరములు పూర్తిగా తెలుస్తాయి.  
ఈ 4 సువార్తలు పరిశీలించి యేసు క్రీస్తు అప్పగింపబడిన రాత్రి నుంచి అయనను సమాధిలో పాతి పెట్టబడే వరకు జరిగిన సంఘటనలను క్రమ పద్దతిలో పొందుపరచడం జరిగినది. 

( Written by: Telugu christian messages page)

......... “యేసు క్రీస్తు అప్పగింపబడిన రాత్రి జరిగిన సంఘటనలు” ..........

1 ) యేసు క్రీస్తు తన శిష్యులతో కలిసి రొట్టెను తిని, ద్రాక్షరసమును సేవించెను (లూకా 22:17-21)

(Note: యేసు శిష్యుల పాదములు కడుగుట అప్పగింపబడిన రాత్రి జరగలేదు. మత్తయి 26:20-21 మరియు యోహాను 13:1-11, 21 వచనములు పరిశీలిస్తే ఈ సంఘటన రాత్రి కాకముందే అనగా సాయంకాలమున జరిగినది అని అర్ధం అవుతుంది)

2 ) శిష్యులలో ఎవడు గొప్పవాడు అని వివాదం రేగెను (లూకా 22:24)

3 ) పేతురు యేసు క్రీస్తు కోసం ప్రాణం పెడతాను అని చెప్పెను (లూకా 22:33)

4 ) శిష్యులతో కలిసి యేసు ఒలీవ కొండకి వెళ్లి తన చెమట రక్తముగా మారేంతగా ప్రార్థన చేసెను (లూకా 22:44)

5 ) యేసయ్య ప్రార్థిస్తూ వుంటే శిష్యులు నిద్రపోయారు (లూకా 22:45,46)

6 ) యూదా యేసు క్రీస్తును ముద్దు పెట్టి సైనికులకు అప్పగించెను (లూకా 22:47,48)

7 ) పేతురు కత్తి తీసి, యేసయ్యను పట్టుకొనుటకు వచ్చిన ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగనరికెను. (లూకా 22:50, యోహాను 18:10)

8 ) యేసు ప్రధానయాజకుని దాసుని చెవి ముట్టి బాగుచేసెను (లూకా 22:51)

9 ) అప్పుడు శిష్యులు అందరూ యేసయ్యను విడిచి పారిపోయారు (మత్తయి 26:56) 
.......... “సిలువ మరణం రోజు వేకువ జామున జరిగిన సంఘటనలు (3.00 am to 6.00 am) ..........

1 ) ప్రధానయాజకుడైన కయప యొద్దకు యేసు క్రీస్తును తీసుకుని వెళ్ళారు (మత్తయి 26:57)

2 ) యేసుపై ఉమ్మివేసి, ఆయనను కొట్టి హింసించుట (మత్తయి 26:59-68)

3 ) పేతురు యేసును ఎరుగను అని చెప్పుట (మత్తయి 26:69-75)

......... “సిలువ మరణం రోజు, ఉదయము నుండి సిలువలో యేసు మరణించే వరకు జరిగిన సంఘటనలు (6.00 am to 3:30 pm)......... 

1 ) అధిపతియైన పొంతి పిలాతుకు అప్పగించుట (మత్తయి 27:2)

2 ) పొంతి పిలాతు, యేసును విచారించి హేరోదు నొద్దకు పంపుట (లూకా 23:1-7)

3 ) హేరోదు యేసును విచారించి తిరిగి పిలాతు నోద్దకు పంపుట (లూకా 23:8-11)

4 ) పిలాతు మరల యేసును విచారించి, సిలువ వేయమని తీర్పు తీర్చుట (లూకా 23:13-25)

5 ) పిలాతు సైనికులు యేసును హింసించుట (మత్తయి 27:26-30)

6 ) తరువాత యేసును సిలువ వేయుటకు తీసుకుని వెళ్ళుట (మత్తయి 27:31)

7 ) దారి మద్యలో సిలువ మోయుటకు కురేనీయుడైన సీమోనును బలవంతం చేయుట (మత్తయి 27:32)

8 ) యేసు సిలువ మోసుకుంటూ గొల్గొతా అనబడు స్థలమునకు వెళ్ళుట (మార్కు 15:22)

9 ) చేదు కలిపిన ద్రాక్షారసం ఇచ్చుట (మత్తయి 27:34)

10 ) యేసుతో పాటు మరో ఇద్దరు నేరస్తులను సిలువ వేయుట (లూకా 23:32, మార్కు 15:23-27) ఉదయం 9 గంటలకు 

11 ) సిలువ మీద దొంగలు ఆయనను నిందించుట (మత్తయి 27:44)

(Note: మత్తయి 27:41-44, మార్కు 15:27-32 వచనాలలో మిగాతా ప్రజలు యేసు క్రీస్తును ఎలా నిందించారో సిలువ మీద దొంగలు కూడా అలానే నిందించారు అని ఉంది. కాని ఎవరు మొదటగా, ఎవరు చివరగా నిందించారు అనేది చెప్పలేదు. వారందరూ యేసును నిందించారు అని మాత్రమే వ్రాసారు. లూకా 23:33-43 వచనములను పరిశీలిస్తే రెండో దొంగలో మార్పు రావడానికి కారణం యేసు పలికిన మొదటి మాటే అని స్పస్టముగా తెలుస్తుంది. కాబట్టి మొదటి మాట పలుకక ముందే సిలువ మీద దొంగలు యేసు క్రీస్తును నిందించారు)

12 ) మొదటి మాట: వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. (లూకా 23:34) ఉదయం 10 గంటల సమయం కావచ్చు. 

13 ) అయన వస్త్రములు పంచుకొనుట (లూకా 23:34)

14 ) ఆయన మీద మోపబడిన నేరం రాసి ఆయన తలకు పైగా ఉంచుట (మత్తయి 27:37)

15 ) శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలు ఆయనను నిందించుట (మత్తయి 27:39-43)

16 ) మొదటి దొంగ క్రీస్తును దూషించుట, రెండవ దొంగ వానిని గద్దించి, ఆయనను చూచి యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమని చెప్పుట (లూకా 23:39-42)

17 ) రెండవ మాట: నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను (లూకా 23:43)

18 ) మూడవ మాట: అమ్మా, యిదిగో నీ కుమారుడు,  యోహాను, యిదిగో నీ తల్లి. (యోహాను 19:26,27)

19 ) ఆ దేశమంతా చీకటి కమ్ముట (మత్తయి 27:45) మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు 

20 ) నాల్గవ మాట: “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ” అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. (మత్తయి 27:46)

21 ) అయిదవ మాట: దప్పిగొనుచున్నాను. (యోహాను 19:28)

22 ) స్పంజీ చిరకను త్రాగనిచ్చుట (యోహాను 19:29)

23 ) ఆరవ మాట : సమాప్తమైనది (యోహాను 19:30)

24 ) ఏడవ మాట: తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. (లూకా 23:46)

(Note: 4,5,6,7 మాటలు మధ్యాహ్నం 3 గంటల నుండి 3:15 మధ్యలో పలికారు, యేసు నాల్గవ మాటను 3 గంటలకు పలికారని మత్తయి, మార్కు సెలవిస్తున్నారు. కనుక 5,6,7 మాటలు 3 గంటల తరువాత వెంటనే పలికి ఉండవచ్చు అని గమనించగలరు.)

.......... “ యేసు క్రీస్తు మరణించిన తరువాత జరిగిన సంఘటనలు” ..........

1 ) దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్ద లాయెను; సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. (మత్తయి 27:50-55)

2 ) ఆయనతో పాటు సిలువ వేయబడిన దొంగల కాళ్ళు విరుగగొట్టుట (యోహాను 19:31-33)

3 ) సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కలో పొడుచుట (యోహాను 19:34)

4 ) అరిమతయ యోసేపు యేసు దేహాన్ని సమాధిలో పెట్టుట (యోహాను 19:38-42)

(Note: ఈ సంఘటనలు అన్నీ కూడా యేసు మరణించిన రోజే 3 గంటల నుండి 6 గంటల మధ్యలోనే జరిగిపోయాయి. మత్తయి 27:57, మార్కు 15:42, లూకా 23:54, యోహాను 19:41,42 వచనాలను పరిశీలిస్తే స్పస్టముగా తెలుస్తుంది.)
Praise the Lord

........

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...