ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బైబిల్ గురించి ఔరా! అనిపించే విషయాలు

📖 *బైబిల్ గురించి ఔరా! అనిపించే విషయాలు...*😱

ఆదికాండము నుండి మలాకీ వరకు గల 39 పుస్తకాలను 5 పంచకాండములుగా, 
12 చరిత్ర గ్రంధములుగా, 
5 కావ్య గ్రంధములుగా, 
17 ప్రవచన గ్రంధాలుగా విభజన చేసారు కాని వాటి కాలములని బట్టి విభజన చేయలేదు. కనుక చాల మంది బైబిలు చదువుతున్నప్పుడు కావ్య మరియు ప్రవచన గ్రంధాలు చాలా ఆలస్యముగా వ్రాసారు అనుకుంటున్నారు. కాని ఆ గ్రంధాలు వ్రాయబడినది చరిత్ర గ్రంధాలు వ్రాయబడిన సమయములోనే. హోషేయ గ్రంధము వరుస క్రమములో 28వ పుస్తకము, కాని ఆ గ్రంధము 2 రాజుల గ్రంధము వ్రాయబడిన సమయములోనే వ్రాసారు. కాబట్టి కావ్య మరియు ప్రవచన గ్రంధాలు పూర్తిగా, స్పస్టముగా అర్థము చేస్కోవాలి అంటే, అవి ఏ సంధర్బములో, ఎవరి కాలములో, ఎవరిని ఉద్దేశించి వ్రాసారో అనేది తెలుసుకోవాలి. కావ్య మరియు ప్రవచన గ్రంధాలను అర్దము చేస్కోవాలి అంటే చరిత్ర గ్రంధములను తప్పనిసరిగా చదవాలి. ఏ గ్రంధము ఏ చరిత్ర గ్రంధము సమయములో వ్రాయబడిందో చూద్దాము.

1 ) యోబు – ఆదికాండము కాలమునకు చెందినది.

2 ) కీర్తనలు – మోషే నుండి ఎజ్రా కాలము వరకు. ఇందులో దావీదు ఎక్కువ కీర్తనలు వ్రాసాడు, కాబట్టి తను ఏ సందర్బములో, ఏ పరిస్థితుల మధ్య ఆ కీర్తనలు వ్రాశాడో తెలుసుకోవాలి అంటే 1 సమూయేలు, 2 సమూయేలు గ్రంధాలను, 1 దినవృత్తాంతములు ని తప్పనిసరిగ్గా చదవాలి.

3 ) సొలోమాను వ్రాసిన గ్రంధాలు – 1 రాజులు, 2 దినవృత్తాంతములు

4 ) యెషయా – 2 రాజులు 14:23 నుండి 21:18 వరకు.

5 ) యిర్మియా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు గ్రంధాలూ చెరలో ఉన్నప్పుడు వ్రాసారు. – 2 రాజులు 22 నుండి 25 అద్యాయముల వరకు.

6 ) హోషేయ – 2 రాజులు 15 అధ్యాయము

7 ) యోవేలు – ఇందులో భవిష్యత్తు ప్రవచనాలు ఉన్నాయి. అందులో కొన్ని నెరవేరాయి, నేరవేరుతున్నాయి కూడా. ఉదాహరణకు యోవేలు 2:28, అపో. కార్యములు 2:17. (e గ్రంధం 2 రాజులు కాలంలోనే వ్రాయబడి ఉండొచ్చు.)

8 ) ఆమోసు – 2 రాజులు 14:23 నుండి 15:17 వరకు

9 ) ఒబద్యా – ఎదోము దేశము గురించి వ్రాయబడినది, ఈ దేశం యాకోబు అన్న అయిన ఏశావు సంతతికి చెందినది. ఆ దేశం గురించి కొన్ని వచనాలు చూడండి. సంఖ్యాకాండము 20:14-21, ద్వితీయోపదేశకాండము 23:7, యేహెజ్కేలు 35:1-15, యిర్మియా 49:7-22, యెషయా 34:5-17.

10 ) యోనా – నీనెవె పట్టణము గురించి 2 రాజులు 14:25.

11 ) మీకా – 2 రాజులు 17-20 అధ్యాయాలు.

12 ) నహూము – యోనా వచ్చిన 150 సంవత్సరాలకు నహూము ప్రవక్త వచ్చి నీనెవె పట్టణం నాశనం గురించి ప్రవచించాడు. 2 రాజులు 15-19 అధ్యాయాలు చదవండి. ప్రస్తుతము నీనెవె పట్టణములో నక్కలు, పాములు, విష సర్పాలు ఉంటాయి.

13 ) హబక్కూకు – 2 రాజులు 23:36 నుండి 24:7 వరకు

14 ) హగ్గయి – చెఱ కాలము తరువాత. ఎజ్రా 1 నుండి 6 అధ్యాయాలు చదవండి.

15 ) జేకర్యా – ఎజ్రా గ్రంధము.

16 ) మలాకీ – ఎజ్రా, నెహెమ్యా గ్రంధముల సమయములో

గమనిక: ప్రవచన గ్రంధములలో అప్పటికి సంబందించిన ప్రవచానాలే కాకుండా భవిష్యత్తు గురించి కూడా ప్రవచనాలు ఉన్నాయి. అందులో కొన్ని నెరవేరాయి. నేరవేరుతున్నాయి, నేరవేరతాయి కూడా. ఆమెన్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...